మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ఇటీవల మా అధ్యక్షుడిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే మంచు విష్ణు పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ట్వీట్ చేసినా మీడియా ముందుకు వచ్చిన ట్రోలర్స్ కనిపెడుతూ నిమిషాల్లో ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారు.
అయితే మెగా ఫ్యామిలీతో ఎప్పుడూ పోటీపడే మంచు విష్ణు సినిమా టికెట్ల వ్యవహారం విషయమై పేర్ని నానిని ఇంటికి తీసుకువచ్చారు. చిరంజీవి జగన్ ను కలవగా మోహన్ బాబు, మంచు విష్ణు పేర్ని నాని ని ఇంటికి పిలిపించుకుని కలిశారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే కాస్త ఆవేశంతో మంచు విష్ణు మంత్రి ని ఇంటికి పిలిచి ప్రభుత్వం జరిపిన చర్చలు అన్నింటి గురించి తెలుసుకున్నామని చెప్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది.
వెంటనే తాను కాఫీకి పిలిస్తే వెళ్లానని ప్రభుత్వం తరఫున కాదంటూ పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇక మంచు విష్ణు ట్విట్టర్ లో ట్వీట్ ను డిలీట్ చేసి కొత్త ట్వీట్ పెట్టారు. ఇక ఇదే విషయమై మంచు విష్ణు ను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. స్క్రీన్ షాట్లతో ఏకిపారేస్తున్నారు.
It was a absolute pleasure hosting you at our home Sri. Nani garu. Much thanks for protecting the interests of TFI 🙏 pic.twitter.com/HjV3pK8yYJ
— Vishnu Manchu (@iVishnuManchu) February 11, 2022