పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది చట్టబద్ధమైన హెచ్చరిక. గతంలో సినిమా థియేటర్లలో నో స్మోకింగ్ స్లయిడ్స్ వేసేవారు. ఇప్పుడైతే ప్రతి మూవీకి ముందుగా పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు తెలియజేయడం తప్పనిసరి.
సినిమాలు పిచ్చ పిచ్చగా చూసే యూత్ నాడు, నేడూ సినీ హీరోల స్టయిల్‌లో సిగరెట్ కాల్చడం ఒక ఫాషన్. 1975లో అపూర్వ రాగంగల్ మూవీతో సినీ జీవితం ప్రారంభించిన రజనీకాంత్ సిగరెట్ గాల్లోకి విసిరి చాకచక్యంగా పెదవుల మధ్య బంధించి కాల్చే స్టయిల్ అప్పటి యూత్‌కు ఓ ఫ్యాషన్. ఆ స్టయిల్ స్మోకర్స్‌ను పెంచే విధంగా తయారైంది. ఇక దీవానా మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన షారూఖ్ ఖాన్ స్మోకింగ్ స్టయిల్ కూడా యూత్‌కి సిగరెట్ కిక్ ఇచ్చింది.
ఇప్పుడు పెళ్లిచూపులు మూవీతో ఎంట్రీ ఇచ్చి అర్జునరెడ్డితో మాస్ అండ్ క్లాస్ ఫాలోయింగ్ పెంచుకున్న విజయ్ దేవరకొండ సిగరెట్ స్మోకింగ్ స్టయిల్ యూత్‌కు ఫాషన్ అయింది.
సినిమాల్లో స్మోకింగ్ డేంజరస్ అని ఎంత ప్రచారం చేసినా ఏమి ఫలితం.? ఇలా హీరోలు ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇలా స్మోకింగ్ ప్రమోటర్లు అయితే ఎలా? అంటూ ఓ నెటిజన్ ట్వీట్ ఇచ్చారు. పిచ్చి అభిమానుల్ని నో స్మోకింగ్ హెచ్చరికల్ని ఫాలో అయ్యేట్లు చేయగలరా? అంటూ ఆవేదన చెందారు. మూవీల్లో మంచి కంటే చెడు ఎక్కువ ఆకర్షితమవుతుంది. ఇప్పటికైనా హీరోలు నో స్మోకింగ్‌ను ప్రమోట్ చేస్తే ఎంత బాగుంటుంది.