సోషల్ మీడియా లో యాక్టీవ్‌గా ఉండే మెగా స్టార్ చిరంజీవి కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన ఎప్పడు సమాజం కోసం మాట్లాడుతూ పోస్ట్ లు పెడుతూ ఉంటారు. ఆమె చేసే సహాయ కార్యక్రమాలను, ఇతరులకు ఆమె ఇచ్చే సలహాలు టిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ ఉపాసన సమాజంలో మంచి చెడులు గురించి మాట్లాడుతూ ఉంటారు.
తాజాగా మరో కొత్త ఐడియా తో ఉపాసన ముందు వచ్చారు. మనం నిత్యం వాడే మల్లెపూలు వాడిపోయిన తరువాత పడేస్తాము. కానీ వాటిని పడేయకుండా రీ సైక్లింగ్ చెయ్యచ్చని.. పూలను కలుషితం చెయ్యటం వల్ల వ్యర్ధాలు ఎక్కువగా తయారవుతాయని, వాటివల్ల పర్యావరణానికి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి రీ సైక్లింగ్ చెయ్యటం మంచిదంటూ చెప్పుకొచ్చింది ఉపాసన. హోలివేస్ట్ అనే సంస్థ ఇలా వాడిపోయిన పూలను సేకరించి వాటిని రీ సైక్లింగ్ చేసి వాటి ద్వారా దూప్‌స్టిక్స్‌ను మరియు పూజా సామాగ్రిని తయారు చేస్తారట.
అందుకే వాడిపోయిన పూలను చెత్తలో పడేయకుండా జాగ్రత్తగా ఉంచి వారిని సంప్రదించినట్లయితే వారు ఇంటికి వచ్చి మరీ వాడిపోయి పాడైపోయిన పూలను తీసుకుంటారంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. దేవుడికి వాడిన పూలు వాడిపోతే మళ్లీ వాటిని దేవుడికే దక్కేలా చేసేందుకు రీ సైక్లింగ్ చేయించడం బెటర్‌అంటుంది ఉపాసన.