అనుకున్నది ఒక్కటి.. అయిందొక్కటి. కరోనా సెకండ్ డోస్ కంప్లీట్ అంటూ.. మంత్రి కేటీఆర్ గ్రేట్‌గా ఫీల్ అవుతూ పెట్టిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు సైతం ఆస్పత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటే.. కేటీఆర్ తాను ఇంటి దగ్గర వ్యాక్సిన్ వేయించుకోవడం ఏమిటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
ప్రజలంతా వ్యాక్సిన్ దొరక్క ఆరోగ్య కేంద్రాల ముందు క్యూ లైన్లనో నిల్చుని నీరసించిపోతోంటే.. మంత్రి మాత్రం దర్జాగా ఇంట్లో కూర్చొని వ్యాక్సిన్ తీసుకుంటారా అంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లడం నామోషీ అనుకుంటే.. కనీసం ఏ యశదో ఆస్పత్రికో వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాల్సి కదా అని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ తాను ఇంట్లో వ్యాక్సిన్ తీసుకున్నట్టే.. ప్రజలకు కూడా ఇంటింటికి వెళ్లి ఎందుకు వ్యాక్సిన్ ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నారు. మంత్రికో రూల్.. ప్రజలకో రూలా? అని కేటీఆర్‌ను కడిగి పారేస్తున్నారు.
ఓ వైపు తిట్లతో పాటు.. మరోవైపు సెటైర్లు పడుతున్నాయి కేటీఆర్ చేసిన ట్వీట్‌కు. ప్రధాని మోడీ జన్మదినం రోజునే కేటీఆర్ వ్యాక్సిన్ వేసుకోవాల్సి వచ్చిందని.. కేంద్రం ఏం సాయం చేయలేదని విమర్శించే ఆయనకు కాలమే సమాధానం చెప్పిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరేమో.. ఇంతకీ కేటీఆర్ వేసుకున్న వ్యాక్సిన్ మోడీ ఉచితంగా ఇచ్చినదేనా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరేమో… కేటీఆర్ వ్యాక్సిన్ తీసుకున్న ఆస్పత్రి భలే ఉందని, దాని పేరు ఏమిటో అని సెటైర్లు వేస్తున్నారు. జాబ్(JAB) ఫ్రమ్ హోం కొత్త పథకం ఏమైనా తీసుకొచ్చారా ఏమిటి అని ఇంకొందరు అడుగుతున్నారు.
కేటీఆర్ ట్వీట్, నెటిజన్ల రియాక్షన్ ఇదే..
Second jab done ✔️ #VaccinationUpdate pic.twitter.com/hfMVOZEV3T
— KTR (@KTRTRS) September 17, 2021
Advertisements