గతంలో ఎన్ని సినిమాలు చేసినా… పైకి ఎంత తిట్టుకున్న స్నేహం ఎక్కడికి పోదు. కానీ రాజకీయాల వల్ల దూరం అయిపోయామని, 15 ఏళ్ల తర్వాత సరిలేరు నికెవ్వరు ఇలా కలిపిందంటూ చిరంజీవి, విజయశాంతి మాట్లాడిన తీరుపై కామెంట్స్ గట్టిగానే వినపడుతున్నాయి. ముఖ్యంగా చిరు విజయశాంతి మాటలకు బాగానే హర్ట్ అయినట్లున్నారు. ఉద్యమం లో విజయశాంతి చిరును టార్గెట్ చేసి మాట్లాడిన మాటలు అప్పటికే రాజకీయాల్లో జూనియర్ అయిన చిరుకు బాగానే తగిలాయి. ఓ వైపు ఓ మై ఫ్రెండ్ అని సాంగ్ వేసుకుంటూనే…. చిరు పదే పదే పాత విషయాలని గుర్తు చేశారు.
ఇక స్టేజ్ పై చిరు-విజయశాంతి లను చూసిన వారంతా… ఈ కాంబినేషన్ కు వయసైపోతున్న బాగానే నటించారే, ఏ మాత్రం గ్యాప్ లేకుండా అంటూ సెటైర్స్ వేస్తున్నారు. సినిమాలో నటన మళ్ళీ చూస్తామో లేదో కానీ ఈ ఇద్దరు కలిసి నటిస్తే బాగుండు అన్న సరదా అయితే తీరింది అని నవ్వుకుంటున్నారు.