జబర్దస్త్ షో తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ముక్కు అవినాష్. ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అయితే ముక్కు అవినాష్ త్వరలో పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా అవినాషే తెలిపారు. ఇదిలా ఉండగా హౌస్ లో ఉన్న సమయంలో అక్కినేని నాగార్జున నీకు పిల్లనుఎవరు ఇస్తారయ్యా అంటూ ఆటపట్టించేవాడు. ఆ సమయంలోనే 2021 సమ్మర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించేశాడు. ఇక అవినాష్ మాటల బట్టి చూస్తుంటే తను చేసుకోబోయే అమ్మాయి ని ఇప్పటికే చూసుకున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది అయితే ముక్కు అవినాష్ పెళ్లి చేసుకునే అమ్మాయి అరియానా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు. హౌస్ లో కూడా ఈ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. దీంతో ముక్కు అవినాష్ అరియానా పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెటిజన్లు పోస్టులు పెట్టేస్తున్నారు.