రైతులపై టీఆర్ఎస్ సర్కార్ కు ఎంత ప్రేమో మరోసారి బయటపడింది. అన్నదాతల సమస్యలపై మీడియా ముందు గొప్పలకు పోయి ఛాలెంజ్ చేసిన కేటీఆర్.. రేవంత్ ప్రతి సవాల్ పై గమ్మునుండిపోయారు. ‘‘రైతు ఛాలెంజ్’’ పేరుతో ఇద్దర్నీ లైవ్ డిబేట్ కోసం ఆహ్వానిస్తే.. రేవంత్ రెడ్డి సరేనని తొలివెలుగు స్టూడియోకు వచ్చారు. కానీ.. కేటీఆర్ మాత్రం సరిగ్గా అదే టైమ్ లో ఆస్క్ కేటీఆర్ రాజకీయం నడిపారు. ఈ నేపథ్యంలో తొలివెలుగు స్టూడియోకు వెళ్తే రిస్క్ లో పడతామని కేటీఆర్ భావించి ఉంటారనే విమర్శలు వస్తున్నాయి. అయితే.. చర్చకు రాకుండా ట్విట్టర్ లో ఉన్న ఆయనకు అక్కడ కూడా చుక్కలే కనపడ్డాయి.
రైతు సమస్యలపై చర్చించేందుకు కేటీఆర్ కోసం తొలివెలుగు స్టూడియోలో చైర్ వేస్తే.. ఆయన ట్విట్టర్ లో సిట్టింగ్ వేశారు. నెటిజన్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో తొలివెలుగు డిబేట్ కు ఎందుకు వెళ్లలేదంటూ నెటిజన్స్ కేటీఆర్ ను ఓ ఆటాడుకున్నారు. ఒకానొక సమయంలో వారి ప్రశ్నలతో చిరాకు పడ్డారు కూడా. ఆస్క్ కేటీఆర్ ఆద్యంతం నెగెటివ్ కామెంట్స్ తోనూ సాగింది. పైగా క్రిమినల్స్ తో తాను డిబేట్ చేయనంటూ ఆయన చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో రైతు ఇబ్బందుల గురించి మాట్లాడేందుకు తొలివెలుగు ఓ చర్చా వేదికను ఏర్పాటు చేస్తే.. వెళ్లకుండా ట్విట్టర్ లో కూర్చుంటారా? అని నిలదీశారు నెటిజన్స్. అంతేకాదు.. టీఆర్ఎస్ లోనే క్రిమినల్స్ ను పెట్టుకుని అలా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. సిరిసిల్లలో ఆరేళ్ల పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డ టీఆర్ఎస్ నేత శంకర్, పాల్వంచలో రామకృష్ణ కుటుంబాన్ని బలిగొన్న వనమా రాఘవ.. ఇంకా కబ్జాలు, సెటిల్ మెంట్లు.. ఇలా అనేక అవినీతి కార్యక్రమాలకు గులాబీ నేతలు పాల్పడుతున్నారుగా అంటూ రివర్స్ ఎటాక్ చేశారు.
నెటిజన్స్ ప్రశ్నలతో ఆస్క్ కేటీఆర్ కాస్తా.. రిస్క్ కేటీఆర్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చర్చకు సిద్ధమని సవాల్ చేసి.. తాము రెడీ అని రేవంత్ ప్రతి సవాల్ చేస్తే వెళ్లకుండా ఉండడం కరెక్ట్ కాదని అంటున్నారు రైతులు, ప్రజలు.