రాత్రి సమయం 10గంటలు . మీడియా ముందు తెలంగాణ సీఎం కెసిఆర్. వైన్ షాపులు ఓపెన్ చేస్తారా? చేయరా? అనే ఉత్కంఠ. కెసిఆర్ స్టార్ట్ చేసాడు.రెడ్ జోన్లో రిస్క్ వద్దంటూ లెక్చర్ దంచి కొడుతున్నాడు. మిగతా రాష్ట్రాల్లో వైన్ షాపులు ఓపెన్ చేసి కరోనా వ్యాప్తి కి కారణమవుతున్నారని, కెసిఆర్ కఠినంగా ఉన్నారు అనుకునే లోపే చావు కబురు చల్లగా చెప్పారు. రెడ్ జోన్ లో కూడా వైన్ షాపులు కుల్లా అని, గత్యంతరం లేదనే మాటలతో కరోనాతో సప్త సముద్రాలు దాటుతున్న జనాన్ని, మురికి గుంటలో పడేశాడనే విమర్శలు వస్తున్నాయి.
ఒక్కసారి కెసిఆర్ ప్రెస్ మీట్ పరిశీలిస్తే, మొదటి 40 నిమిషాలు కఠినంగా ఉండాల్సిన సమయమని, ఎలాంటి షాపులు కూడా రెడ్ జోన్లో ఓపెన్ చేసే రిస్క్ తీసుకోలేమని గట్టిగా చెప్పారు.కానీ తరువాత కెసిఆర్ స్వరంలో మార్పు కనిపించింది. వైన్ షాపులు ఓపెన్ చేస్తున్నామని చెప్పడానికి రకరకాల ఎత్తుగడలు వేశారు. వైన్ షాప్ యాజమానుల నష్టాన్ని ప్రస్తావించారు.సరిహద్దు రాష్ట్రాల గురించి మాట్లాడారు.గత్యంతరం లేదనే సాకుతో ప్రజల ప్రాణాలను బలిపెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కెసిఆర్ రెండు మాటలు
1.రెడ్ జోన్ లో వేరే ఇతర షాపులకు పర్మిషన్ ఇవ్వని కెసిఆర్, మద్యం షాపులకు మాత్రం అనుమతి ఇచ్చారు.
2. కేంద్రం లాక్ డౌన్ సడలించినా మేము కొనసాగిస్తామంటూ,మద్యం షాపులు ఓపెన్ చేశారు.
3.హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది, ఈ ప్రాంతాల్లో కరినంగా వ్యవహరిస్తామంటూనే, లిక్కర్ కు లైన్ క్లియర్ చేశారు.
4. దేశానికే తెలంగాణ ఆదర్శమన్న కెసిఆర్, మద్యం షాపులు క్లోజ్ చేసి ఆదర్శం కాలేకపోయారు.
5. రెడ్ జోన్లో కేంద్రం షాపులు తెరుచుకోవచ్చని చెప్పిందని, మేము మాత్రం సింగిల్ షాప్ కూడా ఓపెన్ చేయమంటునే, రెడ్ జోన్ లో మద్యం షాపులకు అనుమతి ఇచ్చారు.
మొత్తం మద్యం షాపులు ఓపెన్ చేసి, జనాలను బయటకు రాకూడదు అంటే ఎలా సాధ్యమని జనం ప్రశ్నిస్తున్నారు. మద్యం షాపులకు రోజంతా సమయమిచ్చి, నిత్యావసరాల కు మాత్రం నిబంధనలా అని జనం నవ్వుకుంటున్నారు.మద్యం షాపులు ఓపెన్ చేస్తున్నామని డైరెక్ట్ గా చెప్పలేక, డొంక తిరుగుడు మాటలతో, ప్రతిపక్షాలను బూతులు తిడుతూ మేనేజ్ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.