కరోనా ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. కరోనా ముందు ప్రపంచం కరోనా తరువాత ప్రపంచం అని పోల్చుకోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. కరోనా ప్రమాదాన్ని గుర్తించిన ప్రజలు ఎన్ని కష్టాలు ఉన్న లాక్ డౌన్ పాటిస్తూ ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి. రోజు రోజుకు కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో సడలింపుల పేరుతో లిక్కర్ షాప్ లకు పర్మిషన్ ఇవ్వడం పై మాత్రం ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుంది.ఒక పక్క వలస కూలీలు ఆకలితో చచ్చిపోతుంటే పట్టించుకోని ప్రభుత్వాలు హడావిడిగా లిక్కర్ షాప్ లు తెరవడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. వైన్ షాప్ లు ఏమైన మెడికల్ షాప్ ల అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.
వైన్ షాప్స్ తెరవడం వల్ల ప్రజలకు వచ్చే లాభం అంటూ ఏది లేదు జేబులు గుల్లవ్వడం మినహా. ప్రభుత్వాలకు మాత్రం మంచి ఆదాయం వస్తుంది. తమ ఆదాయాన్ని చూసుకున్న ప్రభుత్వాలు ప్రజలను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. అసలే పనులు లేక, ఇన్ని సవత్సరాలుగా దాచుకున్నాదాంతో కాలం వెళ్లదీస్తున్న మధ్యతరగతి ప్రజలకు వైన్ షాప్స్ ఓపెన్ చేయడం పెద్ద శాపంగానే తయారవుతుంది. గత 45 రోజులుగా మందు దొరకడం లేదు దాంతో తాగుడు అలవాటు ఉన్నవాళ్లు మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డ ఇప్పుడు మందు లేకపోయినా పర్వాలేదు అనే పరిస్థితికి వచ్చారు. ఈ సమయంలో వైన్ షాప్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ మందు కు అలవాటు పడే అవకాశం ఉంది. నిత్యావసర సరుకులకు డబ్బులు లేని ఈ సమయంలో మందు తాగడానికి డబ్బులు దొరకడం కష్టం, దాంతో కుటుంబాల్లో గొడవలు పెరుగుతాయి, అన్నింటికీ మించిన ప్రమాదం కూడా పొంచి ఉంది, వైన్ షాప్స్ ఓపెన్ చేయడం అంటే కరోనా వ్యాప్తి లైసెన్స్ ఇచ్చినట్లే. తగిన మైకం లో రోడ్ల పైకి వచ్చి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా తిరిగే అవకాశాలే ఎక్కువ.
కుటుంబాల్లో గొడవలు పెట్టి, కరోనా వ్యాప్తి చేసే వైన్ షాప్స్ ఇప్పుడు తెరవడం ఎంత మేరకు మంచిదో ప్రభుత్వాలు ఆలోచించాలి. వైన్ షాప్స్ కంటే ముందు, వలస కూలీలా ఆకలి తీర్చాలి, రైతులకు ఎరువులు విత్తనాలు అందేలా చూడాలి, చదువులను మళ్ళీ ఎలా పట్టాలెక్కించాలో చూడాలి, సామాన్యుడి జీవితం సాఫీగా సాగే విధంగా చూడాలి. అంతే కాని ఇప్పటికే కరోనా వల్ల నిండా కష్టాల్లో మునిగిన ప్రజలను వైన్ షాప్స్ రూపంలో మరింత కష్టాల్లోకి నెట్టడమే.తమ ఆదాయం కోసం ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడటం ఎంతమేరకు మంచిది కాదు.