2020 సంవత్సరం కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూత పడ్డాయి. షూటింగ్ లు సైతం నిలిచిపోయాయి. దీంతో రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలన్నీ వాయిదా వేసుకోవలసి వచ్చింది. ఇక ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు పర్మిషన్ లు ఇవ్వడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. గత మూడు నాలుగు రోజుల వ్యవధిలో తీసుకుంటే చిన్న పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్, లవ్ స్టోరీ, విరాటపర్వం, అరణ్య, ఆచార్య, వకీల్ సాబ్ ,గని,సీటిమార్, రాధే శ్యామ్, ఉప్పెన, కిలాడి, మహా సముద్రం,పుష్ప, మేజర్ ఇలా వరుస పెట్టి అన్ని సినిమాలు కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాయి. అయితే ఇలా ఒకేసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం పట్ల నెటిజన్లు తెలుగు ఇండస్ట్రీ పై ట్రోల్స్ మొదలుపెట్టారు. రకరకాల మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంచెం గ్యాప్ ఇవ్వండ్రా బాబు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే సినీ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుండడంతో మంచి జోష్ మీద ఉన్నారు. ఏదేమైనా ఇలా అన్ని సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ లను ఒకేసారి రిలీజ్ చేయడం పట్ల కారణం ఏంటనేది మాత్రం తెలియట్లేదు.