టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ అలాగే యాంకర్ దేవి నాగవల్లి మధ్య జరిగిన ఇష్యూ అందరికీ తెలిసిందే. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్. ఈ వివాదంతో ఒక్కసారిగా దేవి నాగవల్లి గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలు పెట్టారు. అసలు ఎవరీ దేవి నాగవల్లి… ఆమె ఎక్కడి నుంచి వచ్చారు… అనే దానిపై మాట్లాడుకుంటున్నారు. ఇక గతంలో దేవి నాగవల్లి బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది. ఆ సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలను ఆమె గురించి తెలిపింది.
ఈమె అసలు పేరు నాగవెల్లి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈమె పుట్టింది. బీకాం చదువుకున్న నాగవల్లి గ్రాఫిక్స్ నేర్చుకుని గ్రాఫిక్ డిజైనర్ గా ఒక ఛానల్ లో జాయిన్ అయింది. ఆ సమయంలో యాంకర్ గా అవకాశం వచ్చింది. అలా డిజైనర్ నుంచి యాంకర్ గా మారింది. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఈమె పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు.
ఆర్ఆర్ఆర్, పుష్ప,భీమ్లానాయక్ కన్నా అఖండ పెద్ద హిట్ … ఎలానో తెలుసా !!
పెళ్లయిన తర్వాత యూఎస్ఏ కూడా వెళ్లిందట. అయితే అక్కడ ఎనిమిది నెలలకు మించి ఉండలేక పోయాను అని దాంతో విడాకులు తీసుకున్నానని చెప్పుకొచ్చింది. ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే అన్ని కోట్లు సంపాదించారు… ఇన్ని కోట్లు సంపాదించారని వార్తలు చదువుతూ ఉంటాను కానీ అంత డబ్బు ఎలా సంపాదించారు అనిపిస్తూ ఉంటుంది.
ALSO READ : టాలీవుడ్ లో 100 కి పైగా సినిమాలు చేసిన ఆ 14 మంది హీరోలు ఎవరో తెలుసా ?
ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డానని బిగ్ బాస్ షో వేదికగా చెప్పుకొచ్చింది. డబ్బులు కోసమే బిగ్ బాస్ కి వచ్చానని కూడా ప్రకటించింది. అయితే అప్పుడు బిగ్ బాస్ లో చెప్పిన మాటలు ఇప్పుడు విశ్వక్ సేన్ వివాదంతో వైరల్ అవుతున్నాయి.