• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » పార్లమెంట్‌ లో డ్యాన్స్ ప్రోగ్రామ్.. నెటిజన్లు ఫైర్..!

పార్లమెంట్‌ లో డ్యాన్స్ ప్రోగ్రామ్.. నెటిజన్లు ఫైర్..!

Last Updated: May 12, 2022 at 1:34 pm

ప్రజా సమస్యలపై, దేశ భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకునే పార్లమెంట్‌లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. నెటిజన్లు ఆ వీడియోపై ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. దేశ భవిష్యత్‌ ఇదేనా అంటూ.. సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ.. తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఇది జరిగింది ఎక్కడంటే..?

ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ప్రధాన కార్యాలయంలోని ఐరోపా పార్లమెంట్‌లో ఇటీవల నాలుగు రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా యూరప్‌ భవిష్యత్‌పై సమాలోచన జరిగింది. సమావేశాల చివరి రోజు పౌరుల సూచనల ఆధారంగా ఈయూ ఎలా అభివృద్ధి చెందుతుంది అన్న దానిపై చర్చించారు. అయితే, ఇంత సీరియస్‌గా సాగిన సెషన్ ముగింపు సమయంలో.. చివరి పది నిమిషాల పాటు నిర్వహించిన వినోదాత్మక కార్యక్రమాలు అందరిని షాక్‌కు గురి చేశాయి. కొంతమంది అమ్మాయిలు పార్లమెంట్‌లోకి వచ్చి డ్యాన్స్‌లు వేశారు.

దీంతో పార్లమెంట్‌ లో ఏం జరుగుతుందో అర్థంకాక నిర్ఘాంతపోయి చూశారు సభ్యులు. తన ప్రసంగం ముందు జరిగిన ఈ డ్యాన్స్‌పై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సంబంధిత వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన నెటిజన్లు యూరప్ పార్లమెంట్‌ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) భవిష్యత్తు ఇదే అయితే మీరంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నట్లే అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఇది హాస్యాస్పదం. ఈయూతో బ్రేకప్‌ పట్ల సంతోషంగా ఉంది’ అంటూ బ్రిటన్‌కు చెందిన ఒకరు కామెంట్‌ చేశారు. ‘దరిద్రంలో ఉన్నాం. ఇది చూడటానికా బాధాకరంగా పన్నులు చెల్లించేది. ఏం స్థాయి ఇది. స్టుపిడ్’ అని మరొక ట్విట్టర్ యూజర్‌ విమర్శించారు.

#EU Interpretive dance performed at European Parliament

But Emmanuel Macron looked unimpressed as the European Parliament was treated to a nine-minute youth dance session “to embody the French Presidency of the European Council” on Monday ahead of his key speech to the assembly pic.twitter.com/g9Gqe9Qamx

— Freedom Truth Honor 🇺🇳 (@FreedomHonor666) May 10, 2022

Advertisements

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఆర్సీబీకి హిట్లర్ గా మారిన బట్లర్.. ఫైనల్ ఆశలు ఆవిరి

తెలంగాణ తేజాలకు ఘన స్వాగతం

నువ్ వ‌స్తే.. నేనుండా..!

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

ఇల్లు అద్దెకు ఇస్తానని చెప్పి… !

బిర్యానిలో బల్లి.. ఖంగుతిన్న వినియోగదారుడు..!

మన ఊరు-మన బడి.. రా“బడి” మాత్రం మేఘాది !

బ్రేకింగ్.. లద్దాఖ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..!

తెలంగాణలో బీజేపీ సర్కార్..మోడీ వ్యాఖ్యలతో శ్రేణుల్లో జోష్

స్టార్ లింక్ శాటిలైట్స్ విధ్వంసానికి చైనా కుట్ర

ఫిల్మ్ నగర్

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

విజయ్-వంశీ పైడిపల్లి మూవీ ఎంతవరకు వచ్చింది?

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

పదో తరగతి పాస్.. జర్మనీలో గ్రాండ్ పార్టీ

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

ఆ దర్శకుడు సమంతను లైట్ తీసుకున్నాడా?

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

పవన్ అభిమానిగా చిరంజీవి..‘భోళా శంకర్’లో సర్‌ప్రైజ్!

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

ఆర్పీ పట్నాయక్ ను బాత్రూంలో పెట్టి గడియ పెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా ?

udaykiran

చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆ స్టార్ డైరెక్టర్స్ తో ఏం మాట్లాడాడో తెలుసా ?

F3 Movie Review and Rating

ఫస్ట్ ఆఫ్ ఓకే…సెకండ్ ఆఫ్ కష్టం – రివ్యూ

RRR: ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఎలా రాజమౌళి ? ప్రేక్షకులు కనిపెట్టేశారు

RRR: ఇంత పెద్ద మిస్టేక్ చేస్తే ఎలా రాజమౌళి ? ప్రేక్షకులు కనిపెట్టేశారు

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)