ఇటీవల తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా వాసి సాయి తేజ మృతి చెందిన సంగతి తెలిసిందే. కురబలకోట ఎగువ రాయగడ గ్రామానికి చెందిన సాయి తేజ్ 1994 లో జన్మించారు. అయితే ప్రస్తుతం సాయి తేజ లాన్స్ నాయక్ గా సైన్యంలో సేవలందిస్తున్నారు. 2013 ఆర్మీలో జాయిన్ అయిన సాయి తేజ బిపిన్ రావత్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. సాయి తేజ కు భార్య శ్యామల మూడేళ్ల కుమారుడు, ఏడాదిన్నర కుమార్తె ఉన్నారు.
అయితే సాయి తేజ తో పాటు 14 మంది ఈ ఘటనలో చనిపోయారు. కాగా సాయి తేజ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం కొంతసేపు స్వగ్రామం లో ఉంచారు. ఆ సమయంలో దాదాపు 70 వేల మందికి పైగా చేరుకున్నారు. ఇదిలా ఉండగా సాయి తేజ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.
ఏపీ సీఎంఓ అధికారులు ఈ విషయం గురించి అధికారికంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా ఇది అనౌన్స్ చేసి మూడు రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ విషయం గురించి ఎక్కడా ప్రస్తావన రాలేదు. ఇదే విషయంపై కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పేరుకే ప్రకటనల అంటూ విమర్శలు చేస్తున్నారు. 50 లక్షల ఎక్స్గ్రేషియా ఆ కుటుంబానికి ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగా ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారో వారికే తెలియాలి.