ప్రస్తుతం గొప్పగొప్ప స్థాయిల్లో స్థిరపడిన వాళ్ళలో చాలా మంది మొదట్లో అత్తెసరు మార్కలతో పాస్ అయినవాళ్ళే. మధ్యలో గోల్ సెట్ చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి అనుకున్న స్థానాన్ని చేరుకోగలిగారు.
మరి కొంత మంది మాత్రం విద్యార్థి దశనుంచీ టాపర్ గా నిలిచి తాము కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న ప్రతిభావంతులు కూడా ఉన్నారు. హీరోయిన్ సమంత చిన్నప్పటి నుంచీ చదువుల్లో ఫస్టట.
తాను చాలా ఇంటర్వూల్లో చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే సమంత 10వ తరగతి రిపోర్ట్ కార్డ్ ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అదే విషయాన్ని ఆమె చాలా సంతోషంగా రీట్వీట్ కూడా చేశారు.
సమంత విద్యాభ్యాసం చెన్నైలోని CSI సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో జరిగింది. అప్పట్లో స్కూల్ టాపర్‌గా నిలిచిన నటి ఇప్పుడు సినిమాల్లో కూడా టాపర్‌గా నిలిచిందని అభిమానులు కొనియాడుతున్నారు కూడా.
రిపోర్ట్ కార్డ్ లో, ఆమె ఇంగ్లీష్ Iలో 90 మార్కులు మరియు ఇంగ్లీష్ II లో 74 మార్కులు సాధించినట్లు పేర్కొంది. గణితంలో, ఆమె ఖచ్చితమైన స్కోరు 100 మరియు ఫిజిక్స్‌లో 90 కంటే ఎక్కువ స్కోర్ చేసింది.
అలాగే హిస్టరీ లో 91 మార్కులు కూడా సాధించింది. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ మార్క్ షీట్ లో ఉన్న మార్కులు చాలా వరకు తప్పుగా వేయబడ్డాయని అర్థమవుతుంది.
ఆ మార్క్ షీట్ లో 50 మార్కులు కు జరిగిన ఫిజిక్స్ ఎగ్జామ్ లో 95 మరియు బోటనీ లో 84 మార్కులు సమంతకు ఆమె టీచర్లు ఎందుకు వేసారో, ఎలా వేశారో వాళ్ళకే తెలియాలి! . పోనీ ఇది సమంతను డీఫేమ్ చేయడానికి ఎవరో రిలీజ్ చేసిన ఫేక్ మార్క్ షీట్ అనుకుందామనుకున్నా.. దానికి కూడా ఆస్కారం లేదు.
ఎందుకంటే…సమంత స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో దీని గురించి మెన్షన్ చేయడం వల్ల ఇది కచ్చితంగా సమంతకు తెలిసే జరిగిందని అర్థమవుతుంది. ఈ విషయం ఐడెంటిఫై చేసి కొందరు నెటిజన్స్ 50 కి 84 ఎలా వచ్చాయి అంటూ మీమ్స్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు.
గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, సమంత కేరళ స్టూడెంట్ కానీ ఆమె మార్క్ షీట్‌లో తమిళ లాంగ్వేజ్ ఉంది. అదీకాక, మార్క్ షీట్ లో ఇచ్చిన ఇయర్ ప్రకారం సమంత 14 ఇయర్స్ కే టెన్త్ పాస్ అయినట్లు తెలుస్తోంది, ఇది ఎలా సాధ్యం అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్ చేశారు.
ఇదంతా ఆమెకున్న హైప్ పెంచడం కోసం ఆమె పీఆర్ చేస్తున్న నాటకం అని కొందరు నెటిజన్స్ మండి పడుతున్నారు. చైతుతో డైవర్స్ తర్వాత సమస్యల్లో చిక్కుకున్న సమంత కు ఇది మరో సమస్యగా తయారవుతుందా…?!అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్న మార్క్ షీట్ జరిగిన ఈ మిస్టేక్ కు సమంత ఎలా స్పందిస్తుందనేది మాత్రం వేచి చూడాలి.