ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు పడ్డాయి. ఈ సమయంలో సిరిసిల్ల పట్టణం అంతా వాగును తలపించింది. రోడ్లన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. కార్లు పడవల్లా కొట్టుకపోయాయి. చాలా కాలనీల్లో గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఇండ్లన్నీ వరద నీటిలోనే ఉండిపోయాయి. అయినా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ మాత్రం తీరిగ్గా హైదరాబాద్ జలవిహార్ లో టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు హజరుకావటంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.
నిన్ను నమ్మి ఓటేసిన ప్రజలంతా వరద నీటిలో ఉంటే… మీరు మాత్రం జలవిహార్ లో ఎంజాయ్ చేస్తున్నారని నెటిజన్లు ఫైర్ అయ్యారు. తాజాగా కేటీఆర్ అండ్ టీం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఓ ఫోటో పై నెటిజన్స్ మరింతగా మండిపడుతున్నారు.
మంత్రి కేటీఆర్ ఓ సమావేశానికి వెళ్తూ అక్కడికి వచ్చిన టెక్ మహీంద్రా ఎండీకి వర్షంలో గొడుగు పట్టారు. దీనిపై ఆనంద్ మహీంద్రా సహా పలువురు హర్షం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ ను కేటీఆర్ టీం ఫోకస్ చేసుకుంటుంది. తాజాగా దీనిపై స్పందించిన నెటిజన్స్… అక్కడ గొడుగు పట్టడం ఓకే కానీ నిన్ను నమ్మి ఓట్లేసిన సిరిసిల్ల జనం వరదలో, వర్షాల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే గొడుగు పట్టి అండగా ఉంటే బాగుండేదని మండిపడుతున్నారు. వరదలో ఉన్న వారిని కనీసం పట్టించుకోని కేసీఆర్… తన వ్యక్తిగత ప్రతిష్ట పెరిగేలా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారు అంటూ విమర్శిస్తున్నారు.