టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ భలే పాయింట్ పట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను విమర్శిస్తూ.. ఆయనతో పాటు తెలంగాణలోని రాజకీయ నేతలందరికి ఓ సత్యాన్ని బోధించారు. బండి సంజయ్‌కి పదవి.. సీఎం కేసీఆర్ పెట్టిన భిక్షేనన్నారు సుమన్. కేసీఆర్ ఉద్యమం చేయకుంటే, తెలంగాణ రాకుంటే.. బీజేపీకి తెలంగాణ శాఖ ఉండేదా.. సంజయ్ అధ్యక్షుడు అయ్యేవారా అని ప్రశ్నించారు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని కేసీఆర్‌పై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
బాల్క సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారో లేదో.. అప్పుడు సోషల్ మీడియాలో ఆయనపై సెటైర్లు మొదలయ్యాయి. బాల్క సుమన్ భలే లాజిక్ పట్టారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బీజేపీ మాత్రమే కాదు కాంగ్రెస్, టీడీపీ, ఇతర రాజకీయ పార్టీలకు కూడా తెలంగాణ శాఖలు ఏర్పాటు కావడానికి కారణం కేసీఆరేనని.. అందుకే ఆ పార్టీల శాసనసభపక్షాలను టీఆర్ఎస్‌లో విలీనం చేసుకొని గురు దక్షిణ తీసుకుంటున్నారుగా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.