వామపక్షాలు అంటే దేవుడిని నమ్మరు.. నమ్మనివాటినే వామపక్షాలు అంటారన్న సాధారణంగా అందరిలో నాటుకుపోయిన అభిప్రాయం. కానీ ఒపినీయన్‌కు చెల్లుచీటి పాడేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జీవీఎంఎసీ ఎన్నికల ప్రచారంలో ఫైనల్లీ అందరికి ఆ పార్టీ గురించి ఓ క్లారిటీ ఇచ్చారు. తాము నాస్తికులం కాదు.. దేవుడనే భావనకు వ్యతిరేకం కాదని గట్టిగా చెప్పేశారు. విశాఖ స్వరూపానంద స్వామిని యాదృచ్ఛికంగానే కలిశానిని.. కొన్ని అభిప్రాయాల గురించి మాట్టాడుకున్నట్టు చెప్పుకొచ్చారు.
జీవీఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నారాయణ.. నిన్న ఉన్నట్టుండి శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామితో కాసేపు ముచ్చటించారు. తమ అభ్యర్థి గెలుపొందేలా ఆశీర్వదించాలని నారాయణ ఆయన్ను కోరారు. నారాయణ చేసిన ఈ పని రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎర్ర జెండా కాస్తా.. కాషాయంగా మారుతోందా అని సెటైర్లు వేస్తున్నారు పరిశీలకులు.