నర్శింహ, చిరుద్యోగి
చూస్తుంటే కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయనే నాకు అనిపిస్తోంది. ఎక్కడ చూసినా నిరసనలు, అసంతృప్తులు, ఆగ్రహాలు, ఆవేశాలే కనిపిస్తున్నాయి.
మొన్న ప్రభుత్వం కాడ పైసల్ లేవని గుట్టు విప్పిన ఎమ్మెల్సీ
నిన్న గులాబి తోటలో తూటా పేల్చిన ఈటెల
నేడు రసమయిలో ఉప్పొంగిన ధిక్కార స్వరం
ఓరుగల్లులో లోలోన కుమిలి పోతూ హాస్యం పాలైన వినయ దాస్యం
ముత్తిరెడ్డిలో పుట్టెను ముసలం
అటు ఇటు కొంటెచూపులు చూస్తున్న కొంటెపులి రాజయ్య
కంత్రిగా మారుతున్న మాజీ మంత్రి కడియం
ఖమ్మంలో పొంగి పొర్లుతున్న పొంగులేటి దుఖం
నల్గొండలో గుత్తాధిపత్యం గుత్తదేమోనని గుంతకండ్లో మొదలైన దిగులు
మెదక్‌లో షురువైన హరీష్‌రావ్ అలజడి
అదిలాబాద్‌లో ఆరంభమైన జోగురామన్న బ్రతుకు దెవులాట.
కోనేరు కోనప్పలో మొదలైంది అంబలి కోసం కట్టెల వేట
నిజామాబాద్‌లో పోచారానికి పట్టిన గ్రహచారానికి లోలోన వ్యక్తమవుతున్న విచారం
కరీంనగర్‌లో ఘాటెక్కెన కారాలు మిరియాలు నూరుతున్న గంగుల కమలం
మహబూబ్‌నగర్‌లో మండుతున్న జూపల్లి జ్వాల
రంగారెడ్డి పట్నంలో మొదలైన అంతర్మధనం
సికింద్రాబాద్‌లో పద్మారావు ఆగం ఆగం
హైదరాబాద్ దానం ఎక్కుపెట్టెను బాణం
ఇంకా ఎందరో.. ఇంకెదరో….?
దొరా.. నీకు మూడిందిక..