తమన్ పాటలు అనగానే… అన్ని సినిమాల్లో ఒకేలా ఉన్నాయంటూ కామెంట్స్ వచ్చేవి. ఆ కామెంట్స్ కాస్త కాపీ క్యాట్‌గా మారిపోయాయి. అల వైకుంఠపురం సినిమాలో ఇటీవల విడుదలైన సామజవరగమన పాట కూడా కాపీ అనే ప్రచారం మర్చిపోక ముందే తాజాగా విడుదలైన రాములో రాముల పాట కూడా కాపీ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒరిజినల్ పాటను, తమన్ పాటను పోల్చుతూ… కాపీ క్యాట్ అంటూ సోషల్‌మీడియాలో ఎగతాళి చేస్తున్నారు.
రాములో రాముల సాంగ్ ని పెట్టి దానికింద మన్నుబెట్టినావు రో రాముల, మాయచేసినావురా రాముల అంటూ ఓ ఫోక్ సాంగ్ ని పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఒకవైపు సోషల్ మీడియా లో తనమీద ఇంతలా ట్రోల్స్ జరుగుతున్నా.. తమన్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు.