విజయ్ దేవరకొండ …పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు.ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు. ఆ ఒక్క సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికి బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. కానీ విజయ్ కి అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్ మాత్రం తగ్గలేదు.
మాములుగా విజయ్ దేవరకొండ బోల్డ్ గా మాట్లాడుతుంటాడు. సినిమా ఈవెంట్ లలో, సక్సెస్ మీట్ లతో విజయ్ మాటలను మెచ్చుకున్నవారు ఉంటారు. అదే విదంగా తిట్టుకునే వారు ఉంటారు. ఇటీవల విజయ్ మాటలుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విజయ్ పై తెగ ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక నటుడిగా గౌరవంగా మాట్లాడకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. యాటిట్యూడ్ పేరు చెప్పి రోజు రోజుకు దిగజారి మాట్లాడుతున్నాడంటూ సెటైర్ లు వేస్తున్నారు. ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో కూడా విజయ్ రాశీఖన్నాను తన ఇబ్బందిపెట్టేశాడు.
నువ్వు డాక్టర్ దగ్గరకు వెల్తే డాక్టర్ నిన్ను ఏ భాగం చుస్తాడంటూ అంటూ లేకి ప్రశ్నలు వేశాడు. ఒక్కసారిగా అవాక్కయిన రాశి, నువ్వు ఇంకా అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ లో ఉన్నావంటూ కవర్ చేసింది. యాటిట్యూడ్ కు అతికి తేడా తెలుసోవాలంటూ సలహా ఇస్తున్నారు నెటిజన్లు. ఇలానే ఉంటే కెరీర్ లో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, ఇప్పటికైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. మరి విజయ్ నెటిజన్ల మాటలు విని అదుపులో మాట్లాడతాడా లేక ఎవరు ఏమి అనుకుంటే నాకెందుకు అనుకుని కంటిన్యూ అవుతాడో చూడాలి.
"..He won't see your chest.." – @TheDeverakonda
Attitude ankoni roju rojuki Labour gaadila maatladuthunnav anna
https://t.co/pU5wx9kCrc— Shashi (@shashib033) February 13, 2020