రాంభావ్ మ్హల్గే ప్రబోధిని, ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇంక్లుసివ్ గవర్నెన్స్ సామాజిక-రాజకీయ నాయకత్వంలో ‘నేతృత్వ సాధన’ సర్టిఫికేట్ కోర్సును అందిస్తోంది. ఈ కార్యక్రమం 41వ ఎడిషన్ ను అక్టోబర్ 11 నుంచి 15 వరకు తెలంగాణలోని హైదరాబాద్ ఐఐజీహెచ్ వారి సహకారంతో నిర్వహిస్తోంది.
నేతృత్వ సాధన(ఎన్ఎస్) అనేది సామాజిక-రాజకీయ నాయకత్వంలో శిక్షణనిచ్చే సర్టిఫికేట్ కోర్సు. ఇది రాంభావ్ మ్హాల్గే ప్రబోధిని(ఆర్ఎంపీ) అందించే ఒక విశిష్టమైన ఐదు రోజుల రెసిడెన్షియల్ కార్యక్రమం. సామాజిక, రాజకీయ క్షేత్రంలో రాణించాలనుకునే యువ నిపుణులు, విద్యార్థులలో నాయకత్వ నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్రముఖ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు, మేధావులు, విద్యావేత్తల ద్వారా ఈ కోర్సుపై శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆర్ఎంపీ దేశం అంతటా నేతృత్వ సాధన యొక్క ఎడిషనల్ ల పేరుతో నిర్వహించి శిక్షణా సంస్థలలోనే అగ్రశ్రేణిగా నిలిచింది. శిక్షార్థులు ముఖ్యంగా వారు ఎంచుకున్న సామాజిక, రాజకీయ రంగాల్లో తదుపరి లీగ్ లో పాల్గొనేవారిని సరైన రీతిలో తీర్చిదిద్దడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొని శిక్షార్థులకు వ్యక్తిగతంగా నాయకత్వ పాఠాలు బోధిస్తారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఇది దేశ వ్యాప్తంగా సామాజిక రంగం, చట్టం, చార్టర్డ్ అకౌంటెన్సీ, ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ వంటి విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన 416 మందికి పైగా శిక్షణ ఇచ్చింది. ముఖ్యంగా యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం పని చేస్తోంది. రెండవది, ఎన్ఎస్ కొన్ని సెషన్లలో నాయకత్వం, సేవ గురించి చర్చిస్తారు. చాలా మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన వాళ్లు ఇప్పుడు తాము ఎంచుకున్న సామాజిక, రాజకీయ క్షేత్రాల్లో సముచితమైన స్థానాల్లో ఉండి తమ సేవలు అందిస్తున్నారు. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ప్రబోధిని మొక్క ఈ ప్లాగ్ షిప్ కార్యక్రమంలో 75 మందికి పైగా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వివరాలకు: netrivasadhana.iidl.org.in వెబ్ సైట్ ని చెక్ చేయాలని నిర్వాహకులు కోరారు.