తానెప్పుడూ ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్ చేయలేదని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపారు. తాము బాలా సాహెబ్ ఠాక్రే సిద్దాంతాల కోసమే పోరాడామని చెప్పారు.
మహావికాస్ అగాఢీ ప్రభుత్వంతో శివసేన కార్యకర్తలు విసుగుచెందారు. శివసేన ఎమ్మెల్యేలు సైతం అగాఢీపై విసిగిపోయారని ఆయన అన్నారు.
సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత సమస్యల వల్ల తాము ఎలాంటి అభివృద్ధినీ చేయలేకపోయామన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసి బీజేపీ తన పెద్ద మనస్సును చాటుకుందన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి రావడానికే తమకు బీజేపీ మద్దతు చేస్తోందని అంతా అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోసమే బీజేపీ వాళ్లు ఇలా చేస్తున్నారని పలువురు విమర్శలు చేశారని పేర్కొన్నారు.
కానీ బీజేపీకి 115 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేవలం 50 మంది ఎమ్మెల్యేలు ఉన్న తమకు అత్యున్నత ముఖ్యమంత్రి పదవిని అప్పగించడం ఆ పార్టీ గొప్పతనమని వివరించారు.