నిర్మాణ రంగంలో ఎక్కువగా ఇనుమును ఉపయోగిస్తారు. వీటికి ఎక్కువగా తుప్పు పడుతూ ఉంటుంది. వీటి వల్ల భవనాలు, మౌలిక సౌకర్యాలకు చాలా నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు స్విట్జర్ లాండ్ శాస్త్రవేత్తులు కొత్త టెక్నాలజీని వృద్ది చేశారు.
స్విస్ ఫెడరల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి తుప్పు పట్టనివ్వని ప్లాస్టిక్ ను తయారు చేశారు. దీన్ని పాలీ ఫినైలిన్ మిథైలిన్ అని పిలుస్తారు. ఇది చూడటానికి ఒక పెయింట్ మిశ్రమం లాగా ఉటుంది. దీన్ని బాగా వేడి చేయాలి.
దీన్ని ఏదైనా వస్తువు ఉపరితలం మీద పూతగా పూస్తే అది గట్టిపడుతుంది. ఆ తర్వాత ఇది వస్తువుపై తుప్పు పట్టకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా ఇది ఇనుము, అల్యూమినియం లాంటి లోహాలు తుప్పు పట్టకుండా కాపాడగలుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.
దీన్ని మళ్లీ రీసైక్లింగ్ కూడా చేసుకుని వినియోగించుకోవచ్చని వెల్లడించారు. దీనితో రంధ్రాలు, పగుళ్లను కూడా గుర్తించ వచ్చని చెప్పారు. పగుళ్లు కనిపిస్తే దీనిలోని రక్షిత పొర(ప్రొటెక్టివ్ లేయర్) మెరుస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో రంధ్రాల ఉన్నట్టు గుర్తించ వచ్చన్నారు.