మహారాష్ట్రలోని భండారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు పసికందులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆసుపత్రి ఐసీయూ బ్లాక్ లో శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది.
అర్ధరాత్రి సమయంలో ఐసీయూ గది నుంచి దట్టమైన పొగ బయటకి రావటంతో సిబ్బంది తలుపులు తెరిచారు. అప్పటికే మొత్తంఒ దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అవుట్బార్న్లో ఉన్న 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురు చిన్నారులను రక్షించి మరో ఆసుపత్రికి తరలించారు. ఇతర రోగులను సైతం సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ప్రమాదానికి విద్యుత్తు షార్ట్‌సర్య్కూట్ కారణంగా అధికారులు భావిస్తున్నారు.