రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తమకు రెఫరెండమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. డిసెంబర్‌లో రాష్ట్ర బీజేపీకి కొత్త సారథి వస్తారని, ఆ నాయకుడు ఎవరనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా ఓకే అన్నారు.
ప్రస్తుతం అధ్యక్ష హోదాలో ఉన్న లక్ష్మణ్ పదవీకాలం డిసెంబర్‌లో ముగియనున్న నేపథ్యంలో… బీజేపీ కొత్త సారథి రేసు మొదలైంది. ఈ రేసులో ఎమ్మెల్సీ రాంచందర్ రావు, సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణతో పాట ఎంపీ బండి సంజయ్ కూడా ఉన్నట్లు బీజేపీ వర్గాలంటున్నాయి.
అధికార టీఆర్ఎస్ పార్టీతో పోరాటం చేసి రాష్ట్రంలో బీజేపి బలం పెంచాలన్న పట్టుదలతో ఉన్న కేంద్రనాయకత్వం ఎవరివైపు మొగ్గుచూపుతుందో చూడాలి.