తమ ఆడబిడ్డను తామే..కిడ్నాప్ చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా మడికొండలో జరిగింది. కొండగట్టు ఆంజనేయుని గుడిలో పెళ్లి చేసుకుని కారులో వస్తుండగా ఆమె బంధువులు వరుణ్ణి కొట్టి ఆమెను తీసుకుని వెళ్లిపోయారు.
సినీఫక్కీని తలపించే ఈ ఘటన హుజూరాబాద్ పట్టణంలో 2023 మే 24 అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…ఓ జంట కొండగట్టులో పెళ్లి చేసుకుని కారులో తిరిగి వెళ్తుండగా దాదాపుగా 15 మంది వారిని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అడ్డుకున్నారు.
అందులో కొందరు వధువును కారులో ఎక్కించుకుని వెళ్లిపోగా మరికొందరు వరుడిపై దాడి చేశారు.పోలీస్ స్టేషన్ కు కూత వేట దూరంలో ఈ సంఘటన జరిగినప్పటికి తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు చెబుతున్నారు.
వధూవరులిద్దరిదీ ఒకే గ్రామమని తెలుస్తోంది.ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో వధువు బంధువులు ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అపహరణ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.