భారతదేశ పార్లమెంట్ నూతన భవనానికి ప్రధాని నరేంద్రమోడీ భూమి పూజ చేశారు. 971కోట్లతో ఈ భవనం నిర్మాణం కానుండగా… 2022 చివరి నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న పార్లమెంట్ సమీపంలోనే సంసద్ మార్గ్ రోడ్డులో కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం కానుంది.
కొత్త పార్లమెంట్ భవనం ప్రత్యేకతలు ఇవే-
1. 100 సంవత్సరాల అవసరాలకు తగ్గట్లుగా తీర్చదిద్దాలన్న సంకల్పం
2. 64,500 చ.మీ విస్తీర్ణంలో కొత్త భవనం
3. 888మంది కూర్చేనంత విశాలమైన హాల్స్
4. నాలుగు అంతస్థులుగా నిర్మించనున్న భవనం
5. లోక్ సభలో 888 మంది ఎంపీలు, రాజ్యసభలో 384మంది ఎంపీలు కూర్చునే వెసులు బాటు
6. విరబూసిన కమలం ఆకృతిలో రాజ్యసభ పైకప్పు భాగం
7. పురి విప్పిన నెమలి పైకప్పులా లోక్ సభ పైభాగం
8. అండర్ గ్రౌండ్ లో 20మంది మంత్రుల ఆఫీసులు, కార్యాలయాలు
9. పాత భవనంతో పోల్చితే తగ్గిన పార్లమెంట్ గేట్ల సంఖ్య
10. 1224 సీట్లతో సెంట్రల్ హాల్ నిర్మాణం