హీరో సెట్స్ కు రావాలంటే నిర్మాత కారు పంపించాలి. ఆ తర్వాత రోజులు మారాయి. కారవాన్ లకు హీరోలు షిఫ్ట్ అయ్యారు. ప్రాజెక్టుకు హీరో కీలకం కాబట్టి అతడికి ఆ ప్రాధాన్యం ఉంటుంది. మరి హీరోయిన్ కు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందా? త్రివిక్రమ్ తలుచుకుంటే ఆటోమేటిగ్గా ప్రాధాన్యం పెరుగుతుంది.
మహేష్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకున్నారు. త్రివిక్రమ్-పూజా మధ్య బంధం గురించి అందరికీ తెలిసిందే. సమంత తర్వాత ఆ స్థాయిలో పూజాను లైక్ చేస్తాడు త్రివిక్రమ్. తన ప్రతి సినిమాలో ఆమెకే అవకాశం ఇస్తుంటాడు.
ఇప్పుడు మహేష్ మూవీ కోసం కూడా పూజా హెగ్డేనే తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఆమె కోసం ఓ కొత్త కారు రెడీ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఆదేశాల మేరకు పూజాహెగ్డే కోసం ఓ కొత్త కారు సిద్ధం అయింది. త్వరలోనే ఆమె సెట్స్ పైకి రాబోతోంది. ఆమె ఈ సినిమా చేసినన్ని రోజులు ఈ కారు ఆమెతోనే ఉంటుంది.
ఇలా ఓ హీరోయిన్ కు సెట్స్ కు రావడానికి ఓ కొత్త కారు కొనడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. ప్రస్తుతం పూజా హెగ్డే రేంజ్ ఆ స్థాయిలో ఉంది మరి.