విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేందుకు రోడ్ మ్యాప్ సిద్దం చేసేశారా…? అందుకే కొత్త సీఎండీని వేశారా…? ఆయన పనే ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్లాంట్ ను అమ్మేయటమా…? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ చీఫ్ గా ఆర్.కే రత్ స్థానంలో అటుల్ భట్ ను నియమించింది కేంద్రం.
అటుల్ భట్ అంటేనే స్టీల్ ప్లాంట్ లను అమ్మేయటమో… కొనేయటమో జరుగుతాయని, ఇది ఎన్నోసార్లు నిరూపితం అయ్యిందని తెలుస్తోంది. 2024 వరకు ఆయనకు ఈ అవకాశం ఇవ్వటంతో ఈలోపు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలన్న కేంద్రం ఆలోచనకు ఆయన కార్యరూపం ఇవ్వబోతున్నట్లు చర్చ జరుగుతుంది.
మొదట టాటా స్టీల్ ప్లాంట్ తో మొదలైన భట్ ప్రస్థానం… ఆ తర్వాత మిట్టల్ ప్లాంట్ కు మారింది. అక్కడ మేనేజర్ గా విధులు నిర్వర్తించారు. ఇరాన్, బ్రిటన్ సహా పలు దేశాల్లో చిన్న చిన్న ప్లాంట్స్ మిట్టల్ గ్రూప్ లో విలీనం కావటంలో భట్ దే కీలక పాత్ర అని తెలుస్తోంది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు సీఎండీ పదవి ఇచ్చారని, ఈయన స్టీల్ ప్లాంట్ ను అమ్మేసి వెళ్తారన్న చర్చ సాగుతుంది.