వాట్సాప్… ఈ రోజుల్లో దీన్ని వాడని వాళ్ళు ఎవరు చెప్పండి. అయితే ఎప్పటికప్పుడు ఈ యాప్ తన యూజర్ల కోసం కొత్తగా కనపడుతుంది. ఇప్పుడు కొత్త ఫీచర్ ని సంస్థ తీసుకొస్తుంది. యాప్ లోపల యూజర్లు కొత్త కొత్త రంగులు చూసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ గురించి WABetaInfo అనే సైట్ బయటపెట్టింది. ఈ మేరకు తన ట్విట్టర్ లో పేర్కొంది. వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోందని, ఇంకా సమాచారం అందుబాటులో లేదని WABetaInfo తన ట్వీట్‌లో పేర్కొంది.
ఈ మేరకు స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేసింది. చాట్‌బాక్స్‌లో పసుపు మరియు ఆకుపచ్చ రంగులు కనపడుతున్నాయి. కొత్త కలర్ షేడ్‌లు కూడా మనం చూడవచ్చు. ఇప్పటికే ఉన్న రంగుల కంటే ఇది కొత్తగా ఉంది. అయితే లేటెస్ట్ ఫీచర్ లో బ్రాడ్ కాస్ట్ లిస్టు లేదా ఆర్కైవ్ చేసిన చాట్‌లు వంటివి కొత్త షేడ్స్‌లో కనిపిస్తాయి. యాప్ థీమ్ కూడా మారుతుంది. తమ యూజర్ బేస్ కు పరిచయం చేసే ప్రతి క్రొత్త ఫీచర్ మాదిరిగానే ఇది కూడా కొత్తగా అందిస్తుంది ఈ సంస్థ.
కాంటాక్ట్-స్పెసిఫిక్ కలర్ షేడ్స్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉంది. అంటే చాట్‌లోని ఒక వ్యక్తి నుండి వచ్చే అన్ని సందేశాలు అన్నీ ఒకేలా రంగులో ఉంటాయి. అటువంటి సందర్భంలో, యాక్టివ్ గా ఉండే వాట్సాప్ గ్రూప్ లకు ఇది ప్లస్ అవుతుంది. ఇందులో చాలా మంది గ్రూప్ లో ఉంటారు కాబట్టి అప్పుడు ఎవరు ఏంటి అనేది గుర్తించడం ఈజీ అవుతుంది. ఇప్పటికే కాంటాక్ట్ లు అన్నీ కూడా వేరు వేరు రంగుల్లో గ్రూప్స్ లో చూపిస్తున్న సంగతి తెలిసిందే. కాల్-టు-యాక్షన్ బటన్లు మరియు సిస్టమ్ సందేశాలు వంటివి కొత్తగా కలర్స్ లో ఉండవచ్చు. అయితే ఇవి డార్క్ మోడ్ లో మాత్రమే ఉండే అవకాశం ఉందని అంటున్నారు.