మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీకి దిగిన ప్రకాష్ రాజ్.. సభ్యుల కోసం ఓ స్పెషల్ మీటింగ్ పెట్టాడు. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో విందు కార్యక్రమం నిర్వహించాడు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
కొన్నాళ్లుగా ‘మా’ ఎన్నికల కేంద్రంగా వివాదాలు కొనసాగుతున్నాయన్న విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ లోకి జీవిత ఎంట్రీ తర్వాత నిర్మాత బండ్ల గణేష్ బయటకొచ్చాడు. పైగా ఎలాంటి విభేదాలు లేవని వారిద్దరూ చెబుతున్నా.. బండ్ల బయటకు రావడం.. ఆ తర్వాతి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ‘మా’ సభ్యులకు విందు కార్యక్రమం ఏర్పాటు చేశాడు. సమస్యలపై చర్చించుకుందాం రండి అంటూ పిలుపునిచ్చాడు. దీనికి ‘మా’లో సభ్యత్వం ఉన్న వంద మంది వరకు వచ్చారు. పలు విషయాలపై చర్చించారు. తమ ప్యానెల్ గెలిస్తే ‘మా’ సభ్యుల సంక్షేమానికి రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తానని తెలిపాడు ప్రకాష్ రాజ్.
ఈ విందు కార్యక్రమంపై అభ్యంతరం చెబుతూ వీడియో విడుదల చేశాడు బండ్ల గణేష్. కరోనా కారణంగా ఎందరో ఆర్టిస్టులు ఇబ్బందులు పడ్డారని.. స్వయానా ఆ బాధను అనుభవించానని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్ గ్యాదరింగ్ కార్యక్రమాలు కరెక్ట్ కాదని సూచించాడు. మీరు చేసే అభివృద్ధిపై ఫోన్ల ద్వారా వివరించాలని ఇలా అందర్నీ ఒకచోటకు చేర్చి ప్రాణాలతో చెలగాటమాడొద్దని హితవు పలికాడు.
It’s my humble request 🙏 pic.twitter.com/fFaXAiEK4g
— BANDLA GANESH. (@ganeshbandla) September 12, 2021
Advertisements