బ్రిటన్‌లో నమోదవుతున్న కొత్త రకం కరోనా స్ట్రెయిన్ కేసులు భారత్‌లోనూ పెరుగుతున్నాయి. బ్రిటన్ నుంచి దేశానికి వచ్చినవారిలో ఇప్పటివరకు 20 మందికి కొత్త కరోనా సోకిందని కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. మంగళవారం నమోదైన ఆరు కేసులతో పాటు మరో 14 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించింది.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో ఎనిమిది నమూనాలు కొత్త స్ట్రెయిన్‌కు పాజిటివ్‌గా తేలాయని వెల్లడించింది. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ ఆస్పత్రిలో ఏడు, హైదరాబాద్ సీసీఎంబీలో రెండు నమూనాలు కొత్త వైరస్‌కు చెందినవేనని గుర్తించినట్లు పేర్కొంది. కోల్‌కతాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినోమిక్స్, పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీలో ఒక్కో కేసు చొప్పున నిర్దారణ అయినట్లు తెలిపింది. బాధితులంతా ఆయా రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కొత్త వైరస్ ను గుర్తించేందుకు 10 ల్యాబులు పనిచేస్తున్నాయి.
నవంబరు 25 నుంచి డిసెంబరు 23 మధ్య మొత్తం 33వేల మంది బ్రిటన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చినట్లు కేంద్రం ఇప్పటికే తెలిపింది.