తెలంగాణలోనూ కరోనా కొత్త స్ట్రెయిన్ ఉందా…? అంటే అవుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లాండ్ నుండి తెలంగాణకు వివిధ మార్గాలుగా 1200మంది వచ్చారని, వారికి కరోనా పరీక్షలు చేస్తున్నామని… పాజిటివ్ వచ్చిన వారి నమునాలను సీసీఎంబీకి పంపినట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
మూడు రోజుల క్రితం సీసీఎంబీకి పంపిన నమునాల నివేదిక తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్యశాఖకు చేరింది. దీంతో ఆ శాఖ ముఖ్య అధికారులు, కరోనా నిపుణుల కమిటీ సభ్యులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. సీసీఎంబీ ఇచ్చిన నివేదికలో కొత్త స్ట్రెయిన్ నమునాలున్నట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకే అధికారులంతా ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం జరగుతుంది.
కొత్త స్ట్రెయిన్ అధికారికంగా గుర్తించారా… అన్నది త్వరలోనే వైద్యారోగ్యశాఖ ప్రకటన చేయనుంది.