ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను ఏవిధంగా ఇబ్బందిపెడుతుందో మనకు తెలిసిందే. కరోనా వైరస్ కేసులు పెరగడం తగ్గడం వంటివి జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మూడవ దశ కరోనా ప్రభావం మన దేశం మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో వైరస్ ను అడ్డుకోవడానికి ప్రజలకు పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు కరోనా వైరస్ లో భాగంగా మరో వేరియంట్ బయటకు వచ్చింది. ఆర్.1 అనే పేరుతో ఒక వేరియంట్ కొన్ని దేశాల్లో చుక్కలు చూపిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ ఉన్న రోగులను అమెరికా సహా 35 దేశాల్లో గుర్తించారు. దాదాపుగా పది వేల మంది రోగులు ఈ వేరియంట్ బారిన పడ్డారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.
అయితే ఇది ప్రమాదకరం అయినా సరే వ్యాక్సిన్ ద్వారా ఇది కంట్రోల్ అవుతుందని అధికారులు తెలిపారు. ఇతర వేరియంట్లు ఏ విధంగా అయితే లక్షణాల ద్వారా బయటకు తెలుస్తాయి ఇది కూడా అంతే అని అధికారులు వెల్లడించారు. అయితే ఈ వ్యాధి వేరియంట్ గురించి కంగారు అవసరం లేదని వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా తెలిపింది.