వ్యాక్సిన్ వచ్చేసింది.. ఇక కరోనా వైరస్‌కు ఖతమైనట్టే.. అని ప్రపంచమంతా సంబరపడిపోతున్న వేళ… బ్రిటన్‌లో వెలుగుచూస్తున్న కొత్త రకం కోవిడ్ వైరస్‌లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే జన్యుమార్పిడి జరిగిన కొత్త కరోనా వైరస్‌తో బెంబేలెత్తిపోతున్న బ్రిటన్‌కు.. మరో కొత్త బెడద వచ్చి పడింది. సౌత్ ఆఫ్రికాలో మార్పు చెంది, అక్కడ ముప్పు తిప్పలు పెడుతున్న మరో కొత్త రకం కరోనా వైరస్ తాజాగా బ్రిటన్‌కు కూడా వ్యాపించింది.
దక్షిణాఫ్రికాలోకి తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్.. లండన్‌లోని ఇద్దరు పౌరులకు సోకినట్టు అక్కడి నిపుణులు గుర్తించారు.ఈ కొత్త రకం కరోనాకు ఇంంతకు ముందు వైరస్‌ల కంటే కూడా వేగంగా వ్యాపించే శక్తి ఉందని వారు చెప్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారితో బ్రిటన్‌కు చేరి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికా నుంచి రాకకపోకలని తక్షణమే పూర్తిగా నిలిపివేశారు. గడిచిన 15 రోజుల్లో దక్షిణాఫ్రికాకు వెళ్లి వచ్చిన వారు సెల్ఫ్ క్వారంటైన్ కావాలని సూచించారు.