రాధేశ్యామ్ ఫ్లాప్ అయింది. బిగ్గెస్ట్ డిజాస్టర్స్ టాప్-5 లిస్ట్ లో చోటు సంపాదించేలా ఉంది. ఈ సినిమా ఫెయిల్ అయిందనే విషయాన్ని మేకర్స్ నేరుగా అంగీకరించడం లేదు. దాన్ని కవర్ చేస్తూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. ఈ సినిమాను ప్రభాస్ ఇమేజ్ డామినేట్ చేసిందట. అందుకే సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదనే అర్థం వచ్చేలా రియాక్ట్ అయ్యాడు దర్శకుడు.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. బాహుబలి-2 తర్వాత అతడి ఇమేజ్ జాతీయ స్థాయికి ఎగబాకింది. అతడి ఫ్యాన్స్ అంతా ప్రభాస్ ను యాక్షన్ ఇమేజ్ లోనే చూడాలనుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడో ఐదేళ్ల కిందట ఒప్పుకున్న రాధేశ్యామ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ నుంచి ఇలాంటి సాఫ్ట్ మూవీని ఆడియన్స్ అస్సలు ఆశించలేదంట. అందుకే ప్రభాస్ ఇమేజ్ ఈ సినిమాను దెబ్బకొట్టిందనే విధంగా యూనిట్ లో సభ్యులు మాట్లాడుతున్నారు.
అయితే మేకర్స్ ఎంత కవర్ చేసుకున్నప్పటికీ, ఎన్ని లాజిక్కులు చెప్పినప్పటికీ రాధేశ్యామ్ ఫెయిల్ అందనేది వాస్తవం. నార్త్ లో డిజాస్టర్ అయిన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో 60శాతం బ్రేక్ ఈవెన్ సాధించి ఆగిపోయేలా ఉంది. అటు కేరళ, తమిళనాడు, కర్నాటకలో కూడా ఈ సినిమా డిజాస్టర్ అయింది.
నిన్నటితో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 53 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఈరోజు, రేపు ఈ సినిమాకు అదనంగా మరో 3 కోట్ల రూపాయల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 40శాతం నష్టాలు మిగిల్చేలా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే.. రాధేశ్యామ్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. వరల్డ్ వైడ్ 123 కోట్ల రూపాయలు రావాలి. అది అసాధ్యం.