కరోనా వైరస్ ఎంట్రీ కావటం ఆలస్యం… అమితాబ్ కాలర్ ట్యూన్ ఫుల్ ఫేమస్ అయ్యింది. దగ్గుతో మొదలయ్యే కరోనా కాలర్ ట్యూన్ తో ప్రజలను అలర్ట్ చేసింది. అందులో గంభీరమైన గొంతుతో అమితాబచ్చన్ వాయిస్ ఉంటుంది. ఓ దశలో ఈ వాయిస్ పై సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్ అన్నీ కావు.
అమితాబ్ కాలర్ ట్యూన్ లో భౌతికదూరం, మాస్క్ తప్పనిసరి అంటూ హెచ్చరించేవారు. కానీ ఇప్పుడు కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేసింది. దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రారంభం అయ్యేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దీంతో పాత కాలర్ ట్యూన్ ప్లేసులో ఇప్పుడు కొత్త ట్యూన్ వచ్చేసింది.
కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహాలు, అభ్యంతరాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు… ఓ ఫీమేల్ వాయిస్ తో కొత్త ట్యూన్ వచ్చేసింది. కరోనా ట్యూన్ లాగే కొత్త ట్యూన్ కూడా తప్పనిసరిగా వినాల్సిందే. కరోనా వైరస్ పై పోరాటంలో కొత్త సంవత్సరం సరికొత్త ఆశలను రేకేత్తిస్తూ… కరోనా వ్యాక్సిన్ తీసుకరాబోతుంది. జనవరి 16 నుండి మేడిన్ ఇండియా వ్యాక్సిన్ వచ్చేసిందని ప్రచారం చేయనున్నారు. మీకు అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని నిశ్చింతగా ఉండండి అంతేకానీ చెప్పుడు మాటలు, ప్రచారం నమ్మవద్దంటూ ట్యూన్ లో ఉంటుంది.