‘భీమ్లా నాయక్’ సినిమా టికెట్స్ ను నిర్ణయించిన ధరకే అమ్మేలా చూడటానికి ఏపీ సర్కారు చాలా కష్టపడుతోంది. అర్థరాత్రి కూడా, ఏపీ ప్రభుత్వం సంబంధిత విఆర్వో లకు లేఖలు పంపింది. బ్లాక్ టిక్కెట్లు విక్రయించడం లేదా అదనపు షో లను ప్రదర్శించడం వంటి అవకతవకలు జరగకుండా చూసేందుకు ప్రతి ఒక్కరినీ ఒక నిర్దిష్ట థియేటర్‌కు కేటాయించారు. అలా కాదని నిబంధనలు ఉల్లంగిస్తే థియేటర్‌ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ల నుండి విఆర్వో లవరకు, పోలీసు బలగాల నుండి గ్రామ వాలంటీర్ల వరకు కూడా ఎక్కడా అదనపు షో లు, టికెట్స్ ధరలు ఎక్కువ కాకుండా చూడాలని సర్కారు ఆదేశాలు జారీ చేశారు.
ఇక పవన్ అభిమానులు అయితే ఏపి ప్రభుత్వ కఠిన వైఖరిని తప్పుబడుతున్నారు. ఒక్క పవన్ అభిమానులనే కాదు… సినీ అభిమానులు అందరూ కూడా ఏపీ సర్కారు వైఖరిని తప్పు బడుతున్నారు.
బీర్‌ను ₹10 కే అమ్మాలని దాని తయారీకి అసలు ఖర్చు ₹5 కంటే తక్కువని కానీ ₹200 కి ఓ బీర్ ని అమ్ముతున్నారని జగన్ పై విమర్శలు చేస్తున్నారు.