కరోనాను అరికట్టేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో కొత్త ఔషధాన్ని కనిపెట్టారు. కొవిడ్-19 నిమోనియాతో బాధపడుతున్న వారిలో ఇది ఎక్కువగా పని చేస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్ హామ్, ఆక్స్ ఫర్డ్ వర్సిటీల శాస్త్రవేత్తలు నామిలుమాబ్ అనే యాంటీబాడీ ఔషధంపై పరిశోధన చేశారు.
నామిలుమాబ్ అనే యాంటీబాడీ ఔషధాన్ని వాస్తవానికి కీళ్లవాతంతో బాధపడుతున్న వారిపై రూపొందించారు. అది తుది ప్రయోగాల్లో ఉండగా… కొవిడ్-19 నిమోనియా రోగులపై ఎలా పనిచేస్తుందన్నది పరిశీలించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సాధారణ చికిత్స, సంరక్షణ విధానాలతో పోలిస్తే నామిలుమాబ్ పొందినవారిలో సీఆర్‌పీ స్థాయి 97శాతం వరకూ తగ్గే అవకాశం ఉందని పరిశోధనలో వెల్లడైంది. ఈ ఔషధం తీసుకున్నవారిలో 78శాతం మంది 28వ రోజు కల్లా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు శాస్త్రవెత్తలు వెల్లడించారు. ఈ అధ్యయన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్ రెస్పిరేటరీ మెడికల్ జర్నల్’ లో ప్రచురితమయ్యాయి.