హైదరాబాద్ పై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టిందని అర్థం అవుతోంది. దానికి ఈమధ్య జరుగుతున్న వరుస దాడులే నిదర్శనం. ఎప్పుడు ఎవరి మీద ఈడీ అధికారులు విరుచుకుపడతారో తెలియని స్థితిలో చాలా మంది బడాబాబులు ఉన్నారు. భయంభయంగా కాలం గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్ నగరానికి ఈడీ కొత్త అధికారి రానున్నట్లు సమాచారం.
ఆయన ఎవరో కాదు దినేష్ పరుచూరి. ఈయన తెలుగు రాష్ట్రాలకి సుపరిచతమైన వ్యక్తే. గతంలో రెండుచోట్లా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఆయన ఎన్ ఫోర్స్‌మెంట్ ఆడిషనల్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈయనను నియమిస్తే కచ్చితంగా తెలంగాణకే వస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆయన్నిఎన్ ఫోర్స్‌మెంట్ ఆడిషనల్ డైరెక్టర్ గా అపాయింట్ చేశారు గాని.. ఎక్కడా అనేది స్పష్టంగా తెలపలేదు. దినేష్ 2009 సంవత్సరం బ్యాచ్ అధికారి. ఈయన వస్తే నగరంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జరుగుతున్న దాడులతో టెన్షన్ లో ఉన్నారు బడాబాబులు. ఇప్పుడు కొత్త ఆఫీసర్ వస్తే.. ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనేది ఆసక్తికరంగా మారింది.