మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ అనేది అత్యంత కీలకం. వాట్సాప్ లేకుండా ఏ పని జరిగే అవకాశం లేదనే విధంగా మారిపోయింది. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు మరో ఫీచర్ ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు సేవ్ చేయని ఫోన్ నంబర్ కు కూడా మెసేజ్ చేసే విధంగా మార్పులు చేయడానికి రెడీ అయింది వాట్సాప్.
Also Read:షెడ్యూల్ కన్నా ఒక్క రోజు ముందే…!
దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజం వర్క్ చేస్తుంది. మీరు సేవ్ చేయని నెంబర్ కు వాట్సాప్ నుంచి కాల్ చేసే ఫీచర్ ను కూడా తీసుకొస్తుంది. ఫోన్ నెంబర్ సేవ్ చేసుకునే ఆప్షన్ ను కూడా అక్కడే ఇస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా మీకు చాట్‌లో +91 ఫోన్ నంబర్‌ను పంపినట్లయితే, ఈ నంబర్ కు వాట్సాప్ ఉంటే మీకు మూడు ఆప్షన్స్ కనపడతాయి. ముందుగా +91తో చాట్ చేయమని… లేదంటే +91ని డయల్ చేయమని లేదా కాంటాక్ట్ లో యాడ్ చేసుకోమని చూపిస్తుంది.
ఈ నెంబర్ వాట్సాప్ లో లేదంటే మాత్రం కాంటాక్ట్ లో యాడ్ చేసుకోవడమే చూపిస్తుంది. వాట్సాప్ వెర్షన్ 2.22.8.11లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ అన్ని ఫోన్స్ లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే దానిపై క్లారిటీ లేదు. ఇది ఇంకా టెస్టింగ్ దశలో ఉన్నందున కంపెనీ ఈ ఫీచర్‌ని రెండు నెలల్లో తీసుకొచ్చే అవకాశం ఉండవచ్చు.
Also Read:టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్టు.. ఉన్నతాధికారులకు నోటీసులు