స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను చాలా మంది వినియోగిస్తుంటారు. దీంతో ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది సంస్థ. తాజాగా మరో రెండు అధునాతన ఫీచర్లను వినియోగదారుల కోసం పరీక్షిస్తోంది.
ప్రస్తుతం వాట్సాప్ యూజర్లలో చాలా మందికి చిరాకు పుట్టించే అంశం ఏమిటంటే.. మనం ఏదైనా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినప్పుడు అందులోని సభ్యులందరికీ ఆ విషయం తెలుస్తుంది. మనం గ్రూప్ నుంచి వెళ్లిపోయినట్లు చిన్న టెక్ట్స్ లైన్ కన్పిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీనితో మనం గ్రూప్ నుంచి లెఫ్ట్ అయితే అడ్మిన్‌కు తప్ప గ్రూప్‌లో ఇతర సభ్యులెవరికీ ఆ విషయం తెలియదు. ఎలాంటి సందేశం కూడా కన్పించదు.
ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. అదేంటంటే మనం ఏదైనా వాట్సాప్ గ్రూపులో మెంబర్‌గా ఉండి, ఏదైనా కారణం చేత ఆ గ్రూపు నుంచి ఎగ్జిట్ అయితే ఆ అలర్ట్ అందులోని సభ్యులందరికీ కాకుండా, కేవలం అడ్మిన్‌కి మాత్రమే వెళ్లేటట్టు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది.
Advertisements
ఇక ఈ ఫీచర్‌తో మనకు ఇష్టం లేని గ్రూప్‌ల నుంచి సైలెంట్‌గా వెళ్లిపోవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌లో పరీక్షిస్తున్నారు. మరో రెండు నెలల్లో అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే, ప్రస్తుతం వాట్సాప్ స్టేటస్‌లో ఏదైనా వెబ్సైట్ లింక్ షేర్ చేసినప్పుడు అది సాధారణ టెక్ట్స్ లానే కన్పిస్తుంది. కొత్తగా వచ్చే అప్‌డేట్‌లో ఎవరైనా స్టేటస్‌లో లింక్ షేర్ చేస్తే దానికి సంబంధించిన డీటైల్డ్ ప్రివ్యూ కన్పించనుంది. అంటే లింక్ సంబంధించి ఫోటోతో పాటు వెబ్సైట్ వివరాలు కన్పిస్తాయి.