ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. సినిమా షూటింగ్స్ కోసం రెగ్యూలర్ గా తారలంతా వెళ్లే ప్రాంతం కావటంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులను ఆహ్వానించిన హిమాచల్ ప్రభుత్వం అందులో భాగంగా 100కోట్లతో నిర్మించ తలపెట్టిన ఫిల్మ్ సిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టూరిజంపైనే ఎక్కువగా ఆధారపడ్డ తమ రాష్ట్రానికి… ఫిల్మ్ సిటీ నిర్మాణంతో మరింత ఆదాయం వస్తుందని, షూటింగ్స్ కేరాఫ్ అడ్రస్ హిమాచల్ కాబోతుందని అక్కడి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.