ఏపీలో సినిమా టికెట్ల ధరల పై ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ చాలా వరకు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అఖండ, పుష్ప భీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ప్రస్తుతం ఉన్న రేట్లతోనే రిలీజ్ అయ్యాయి. అయితే రాధే శ్యామ్, ఆర్ ఆర్ ఆర్, ఆచార్య, సర్కారు ఏర్పాటు వంటి చిత్రాలకు ప్రస్తుతం ఉన్న టికెట్ ధరల దృష్ట్యా నష్టాలు తప్పవు.
ఈ నేపథ్యంలోనే చిరంజీవి సహా మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. టిక్కెట్ల ధరల విషయంలో మరో నిర్ణయం తీసుకోవాలంటూ కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని కూడా ప్రకటించారు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా టికెట్ల ధరల పై ఏపీ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం కొత్త జీవోను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ జీవో జారీ చేయాలని ఇప్పటికే సినీ పెద్దలు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు.
జీవో 35 తో పోల్చుకుంటే కొత్త జీవో లో చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ధరలు ఉండనున్నాయట. గ్రామీణ ప్రాంతాలలోని థియేటర్లకు ఊరటనిచ్చే విధంగా ఈ కొత్త ధరలు ఉండనున్నాయట. మరి చూడాలి జగన్ సర్కార్ టికెట్ ధరల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.