సినిమా టికెట్ల ధరల పై కొత్త జీవో ను ఏపీ సర్కార్ విడుదల చేసింది. టిక్కెట్ల ధరల కోసం మున్సిపల్, కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలుగా విభజన చేసింది.
నాన్ ఏసీ, ఏసీ, మల్టీప్లెక్స్ ల వారీగా ధరలను నిర్ణయించింది. ప్రతి థియేటర్ ను ప్రీమియం నాన్ ప్రీమియం గా విభజించింది. కార్పొరేషన్ లో నాన్ ఏసి ₹40 – ₹60 ఏసి ₹70 – ₹100 గా నిర్ణయించింది. కార్పొరేషన్ లో స్పెషల్ నాన్ ఏసి థియేటర్లో ₹100 -₹125 అలాగే మల్టీప్లెక్స్ లలో రెగ్యులర్ సీట్స్ ₹150, రిప్లై నర్ ₹250 గా ప్రకటించింది.
మున్సిపాలిటీలలో నాన్ ఏసి₹ 30 – ₹40, ఏసి ₹60 – ₹80 గా నిర్ణయించింది. మున్సిపాలిటీలో స్పెషల్ థియేటర్ లో ₹80 – ₹100 మల్టీప్లెక్స్ లో ₹125 రూపాయలు గా జీవో లో పేర్కొంది.
నగర పంచాయతీ గ్రామ పంచాయతీలలో నాన్ ఏసి ₹20 – ₹40 ఏసి ₹50 – ₹70 అలాగే స్పెషల్ థియేటర్లలో ₹70 – ₹90 మల్టీప్లెక్స్ లో ₹100 రూపాయలు గా నిర్ణయం తీసుకుంది. అలాగే ఐదు షోలకు కూడా అనుమతినిస్తూ ఈ జీవో ను విడుదల చేసింది.