13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఏపీ కొత్త గవర్నర్ గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులు కాగా ఏపీ గవర్నర్ గా ఉన్న బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్ గఢ్ రాష్ట్ర గవర్నర్ గా బదిలీ అయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన స్థానే రమేష్ బయాస్ ను నియమించారు.
సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గాకైవల్య త్రివిక్రమ్ పట్నాయక్, ఝార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్, అసోం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్లా, మణిపూర్ గవర్నర్ గా అనసూయ ఉకియే , లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బీడీ మిశ్రా , నాగాలాండ్ కి గణేశన్ ని గవర్నర్ గా నియమించారు.
తన రాజీనామాను ఆమోదించాలని మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ గతంలోనే కోరారు. బీహార్ గవర్నర్ ఫగు చౌహాన్ ని తిరిగి మేఘాలయ గవర్నర్ గా నియమించారు.
హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్.. బీహార్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరంతా తమ బాధ్యతలు చేబట్టిన నాటి నుంచి వీరి నియామకాలు అమలులోకి వస్తాయి.