ఈ కరోనా వైరస్ ఎప్పుడు పోతుందో గాని ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఎప్పుడు ఏ వేరియంట్ అంటారో అని అందరూ కంగారు పడిపోతున్నారు. ఇక ఇప్పుడు భారత ప్రభుత్వం నుంచి ఒక షాకింగ్ ప్రకటన వచ్చింది. 18 ఏళ్ళు దాటిన కోవిడ్-19 రోగుల వైద్యానికి సంబంధించిన క్లినికల్ గైడెన్స్‌ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
కోవిడ్ రోగికి రెండు మూడు వారాల కంటే ఎక్కువ కాలం దగ్గు ఉంటే క్షయ, ఇతర పరిస్థితులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని AIIMS, ICMR-COVID-19 నేషనల్ టాస్క్ ఫోర్స్ మరియు జాయింట్ మానిటరింగ్ గ్రూప్ (DGHS) సోమవారం దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. రోగులకు వినియోగించే స్టెరాయిడ్‌లతో ఉపయోగం ఉందని ఆధారాలు లేవని పేర్కొన్నారు.
దగ్గు రెండు-మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, క్షయవ్యాధి మరియు ఇతర పరిస్థితులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించాల్సిందే అని పేర్కొంది. రెమ్‌డెసివిర్ వాడకాన్ని సిఫారసు చేస్తున్న నేపధ్యంలో పలు సూచనలు చేసింది. ఆక్సిజన్ సపోర్ట్‌లో లేని లేదా ఇంట్లో ఉండే రోగులకు ఆ మందు వాడవద్దని సూచించారు. మార్గదర్శకాల ప్రకారం, తీవ్రమైన వ్యాధి లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అడ్మిషన్ ప్రారంభమైన 24 నుండి 48 గంటలలోపు టోసిలిజుమాబ్ ఔషధాన్ని తీవ్రమైన వ్యాధి ఉంటే ఉపయోగించాలని స్పష్టం చేసింది.