హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారబోతుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఎన్ని రోజులైనా సభను నిర్వహిద్దాం, ప్రతిపక్షాలు అడిగే ప్రతి సబ్జెక్ట్ పై చర్చకు రెడీ అంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ నిర్వహణపై కామెంట్ చేశారు.
కానీ ఇప్పుడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. టీఆర్ఎస్ పార్టీ మండలానికో మంత్రిని, గ్రామాల వారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలిచ్చి మరీ ప్రచారం చేస్తుంది. కానీ మంత్రి హరీష్ రావుతో పాటు అరడజను మంత్రులంతా ఇప్పుడు అసెంబ్లీకి రావాల్సిందే. కనీసం 10మంది ఎమ్మెల్యేలు ప్రచారంలో ఉండకుండా పోతారు. ఇది ఈటల రాజేందర్ కు ప్లస్ గా మారబోతుందన్న వాదనను విశ్లేషకులు తెరపైకి తెస్తున్నారు.
పోనీ అసెంబ్లీని కుదిద్దాం అన్నా ఇప్పటికిప్పుడు ఆ పని చేస్తే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తాయి. దీంతో సీఎం కేసీఆర్ కు ఇది కొత్త తలనొప్పేనని, మంత్రులనంతా అసెంబ్లీకి వద్దని హుజురాబాద్ పంపినా ప్రభుత్వాన్ని ఎండగట్టడం ఖాయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.