కొణిదెల కుటుంబం నుంచి కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. రామ్ చరణ్ కు తమ్ముడు వరుసయ్యే ‘పవన్ తేజ్ ‘కథానాయకుడిగా ఓ కొత్త సినిమా తెరెకెక్కుతోంది. అభిరామ్ డైరక్షన్ లో ఈ యువహీరోను పరిచయం చేస్తూ నిర్మాత రాజేష్ నాయుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టారు చిత్రబృందం. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో కథానాయికగా మేఘన చేస్తోంది. కొణిదెల ఫ్యామిలీ నుంచి ఈ కొత్త హీరో వస్తుండటంతో ఆయన ప్రేక్షకులకు తొందరగానే చేరువ అవ్వనున్నాడు. ఈ కొత్త సినిమాకు కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. కొణిదెల బ్రాండ్‌తో వస్తున్న ఈ కొత్త హీరో ప్రేక్షకులను ఎంతమాత్రం ఎంటర్ టైన్ చేయనున్నాడో చూడాలి మరి.