కొత్త దర్శకుల్ని పరిచయం చేయడమే కాదు, కొత్త కొత్త ముద్దుగుమ్మల్ని వెండితెరకు పరిచయం చేయడంలో కూడా నాగార్జునకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. స్టార్ హీరోయిన్ అనుష్కను పరిచయం చేసింది ఈ హీరోనే. సూపర్ సినిమాతో అనుష్కకు అవకాశం ఇచ్చాడు.
ఇలా తన కెరీర్ లో ఎంతోమంది అమ్మాయిల్ని ప్రోత్సహించిన నాగార్జున, ఇప్పుడు మరోసారి అదే పని చేయబోతున్నాడు. తన కొత్త సినిమా కోసం ఓ అమ్మాయిని సెలక్ట్ చేశాడు. ఆ అమ్మాయి పేరు మానస. పక్కా హైదరాబాదీ.
బెజవాడ ప్రసన్నకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు నాగార్జున. ఈ మూవీలో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మిస్ ఇండియా-2020 మాసన వారణాసి పేరు పరిశీలనకొచ్చింది. ఆమె ప్రొఫైల్ చూసిన వెంటనే నాగ్ కు నచ్చింది. వెంటనే మానస, అన్నపూర్ణ స్టుడియోస్ లో ల్యాండ్ అవ్వడం, ఫొటోషూట్ జరగడం చకచకా అయిపోయాయి.
అయితే,, మానసను ఎంపిక చేశారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాలో నాగ్, డబుల్ రోల్ చేయబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యంగ్ నాగ్ సరసన మానసను తీసుకోవాలనేది ప్లాన్. ఆమె అదృష్టం ఎలా ఉందో చూడాలి.